మెరిట్‌ జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

మెరిట్‌ జాబితా విడుదల

Feb 22 2026 7:26 AM | Updated on Feb 22 2026 7:26 AM

మెరిట

మెరిట్‌ జాబితా విడుదల

మెరిట్‌ జాబితా విడుదల ఎంఈఓల నూతన కార్యవర్గం మట్టి నమూనా పరీక్షలు ముఖ్యం పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

మదనపల్లె సిటీ: జిల్లాలో భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఫిజియోథెరపిస్టు పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూల తరువాత మెరిట్‌ జాబితాను విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ అనూరాధ తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఐదు ఫిజియోథెరపిస్టు పోస్టులకు ఇటీవల జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. జాబితాను సమగ్ర శిక్ష కార్యాలయం, అన్ని మండల విద్యాశాఖ కార్యాలయాల నోటీసుబోర్డులలో ప్రదర్శించినట్లు తెలిపారు. మెరిట్‌ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈనెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మదనపల్లెలోని సమగ్రశిక్ష జిల్లా కార్యాలయాల్లో లిఖిత పూర్వకంగా అందజేయాలని సూచించారు.

మదనపల్లె సిటీ: మండల విద్యాశాఖ అధికారుల జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా రెడ్డిశేఖర్‌( బి.కొత్తకోట), మనోహర్‌ (పెద్దమండ్యం)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం వర్చువల్‌ విధానంలో సంఘ జిల్లా ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఉపాధ్యక్షులుగా కె.ద్వారకనాథ్‌ (ఎంఈఓ, కురబలకోట), కె.చక్రెనాయక్‌ (ఎంఈఓ, లక్కిరెడ్డిపల్లె), గౌరవ అధ్యక్షుడిగా పి.సురేంద్రబాబు (ఎంఈఓ, గుర్రంకొండ)లను ఎన్నుకున్నారు. అలాగే మదనపల్లె డివిజన్‌ కన్వీనర్‌గా కె.ప్రభాకర్‌రెడ్డి, పీలేరు డివిజన్‌ కన్వీనర్‌గా మునీంద్రనాయక్‌, రాయచోటి డివిజన్‌ కన్వీనర్‌గా రామకృష్ణుడు, కోశాధికారిగా వెంకటరమణ ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎన్‌.నారాయణ, కేశవరెడ్డి, మహిళా కన్వీనర్‌గా హేమలత ఎన్నికయ్యారు.

పీలేరు: మట్టి నమూనా పరీక్షల నిర్వహించడం ముఖ్యమని.. అప్పుడే పొలానికి పోషకాల సమతుల్యత లభిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి జి. శివనారాయణ అన్నారు. శనివారం మండలంలోని ముడుపులవేములలో ఏపీసీఎన్‌ఎఫ్‌ రైతుల పొలంలో మట్టి నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాలని సూచించారు. రైతులు విశిష్ట సంఖ్య నమోదు ఫిబ్రవరి 28లోగా చేపించుకో వాలని తెలిపారు. అలాగే ఈ–పంట ల్యాండ్‌ పార్సెల్‌ ఈ నెల 25లోపు నమోదు చేయాలని తెలిపారు. ఏడీఏ వై.వి. రమణరావు, ఏవో రమాదేవి, ఎంపీఈవో జ్యోతి పాల్గొన్నారు.

మదనపల్లె సిటీ: ఇంటర్మీడియట్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారి రవి అన్నారు. ఈనెల 23 నుంచిప్రారంభమ య్యే పరీక్షలకు నిమిషం అలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో 28,550 మంది పరీక్ష లు రాయనున్నట్లు తెలిపారు. వీరిలో మొదటి సంవత్సరం 14,607 మంది, ద్వితీయ సంవత్సరం 13,943 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందు కోసం 700 మంది ఇన్విజిలేటర్లు, 127 మంది చీఫ్‌ సూపరిండెంట్‌లు, 127 చీప్‌ సూపరిండెంట్‌లు, డీఓ, కస్టోడియన్లను నియమించామని వెల్లడించారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యా లు హాల్‌టిక్కెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవన్నారు. విద్యార్థులు నేరుగా నెట్‌ సెంటర్‌ నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చుననన్నారు.

మెరిట్‌ జాబితా విడుదల 1
1/2

మెరిట్‌ జాబితా విడుదల

మెరిట్‌ జాబితా విడుదల 2
2/2

మెరిట్‌ జాబితా విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement