ములకలచెరువు : రోడ్డు దాటుతున్న మహిళను ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి మండలంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పర్తికోట పంచాయతీ మావిళ్లవారిపల్లెకు చెందిన టి. సుజాత పనుల మీద భర్త పెద్దిరెడ్డితో కలిసి వేపూరికోటకు వెళ్లింది. అక్కడ రోడ్డు దాటుతున్న సుజాతను అనంతపురానికి చెందిన సింహాద్రి, ప్రశాంత్‌లు ద్విచక్రవాహనంపై ములకలచెరువు వైపు వెళ్తూ వేగంగా వచ్చి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో సుజాత(40), సింహాద్రి(30), ప్రశాంత్(25)లకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


