ఒంటిమిట్ట రామయ్య సేవలో ట్రైనీ ఐఏఎస్‌లు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని ఆదివారం ట్రైనీ ఐఏఎస్‌లు హర్షిత్ అగర్వాల్, స్వాతి పోగాట్, సుమిత్ కుమార్ సింగ్, సుభరామ్, ప్రశాంత్ సింగ్, మంజునాథ్ సిద్దప్ప దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి, గర్భాలయంలోని మూల విరాట్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రంగమండపంలో వారిని అర్చకులు సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై శిక్షణ కలెక్టర్లు 12 మంది ఆదివారం పర్యటించారు. వీరు భారత్ దర్శన్ కార్యక్రమంలో ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చారు. హార్సిలీహిల్స్ విశేషాలు, బ్రిటిష్‌పాలనలో కొనుగొన ఈ కొండ పూర్వ విషయాలను రెవెన్యూ సిబ్బంది వారికి వివరించారు. కొండపై ప్రకృతి అందాలను తిలకించారు. ఆహ్లదకరమైన వాతావరణం బాగుంది ప్రశంసించారు. ఈ 12 మంది అన్నమయ్యజిల్లాలో ఉండి శిక్షణ పొందుతారు.


