కోటి సంతకాలతో ప్రజల్లో చైతన్యం
సుండుపల్లె: పేద ప్రజల విద్య, వైద్యం అందించడమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తెచ్చిందని పార్టీ జిల్లా పరిశీలకుడు సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని మాచిరెడ్డిగారిపల్లె, పెద్దినేనికాలువ, ముడుంపాడు గ్రామాల్లో రచ్చబండ – కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రభుత్వ పాలనలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేసి రూ.475 కోట్లతో నిర్మాణాలు చేపడితే చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఒకటిన్నర సంవత్సరంలోపే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందామని వారు అన్నారు. కార్యక్రమంలో వీరబల్లి వైఎస్సార్‌సీపీ నాయకులు మదన్‌రెడ్డి, సుండుపల్లె మండల కన్వీనర్ రామస్వామిరెడ్డి, జెడ్పీటీసీ ఇస్మాయిల్, రాష్ట్ర బూత్ కమిటీల ప్రధాన కార్యదర్శి రెహమాన్‌ఖాన్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఆరంరెడ్డి, నాగేంద్రనాయక్ చౌహాన్, చంద్రనాయక్, బేరిపల్లె రఫీక్, నసీమాబాను, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి


