నేషనల్ హైవేపై రైతుల ధర్నా
తంబళ్లపల్లె : పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వం లాక్కుంటే తాము బతుకుదెరువు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం రైతులు రెడ్డికోట వద్ద నేషనల్ హైవేపై ధర్నాకు దిగారు. పర్లగొల్లపల్లె వద్ద 20 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించి పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఏపీఐఐసీకి కేటాయించేందుకు గతంలో అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. సెప్టెంబర్ నెలలో మదనపల్లె సబ్ కలెక్టర్ కల్యాణి ఆ భూములను పరిశీలించారు. రైతులు తాము భూములు సాగు చేసుకుంటున్నామని వాటిని లాక్కుంటే బతుకుదెరువు కో ల్పోతామని వాపోయారు. సోమ వా రం స్థానిక తహశీల్దార్ శ్రీనివాసులు,ఏపీఐఐసీ అధికారితో పాటు భూమి పరిశీలించేందుకు వెళ్లగా రైతులు అడ్డుకున్నారు. ఆ భూములుపో తే మాకు ఆత్మహత్యలే శరణ్యమని రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. రాకపోకల వాహనాలకు అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైతులకు సర్దిచెప్పడంతో నిరసన విరమించారు.


