రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్‌సీపీ లేఖలు | Ysrcp Letters To The State Chief Electoral Officer | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్‌సీపీ లేఖలు

May 7 2026 6:34 PM | Updated on May 7 2026 7:24 PM

Ysrcp Letters To The State Chief Electoral Officer

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పలు అంశాలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖలు రాశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూత్ లెవల్ ఆఫీసర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందించాలని లేఖ రాశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కోసం ఉపయోగించే ఓటరు జాబితాను డిజిటల్ ఫార్మాట్లో అందించాలని మరొక లేఖ రాశారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మరో లేఖలో పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున బీఎల్ఎ ల నియామకానికి సంబంధించిన ఫారాలను ఈఆర్వోలు స్వీకరించేలా ఆదేశాలు ఇవ్వాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement