‘దేవస్థానం భూములను పరిశ్రమలకు వాడటం దారుణం’ | YSRCP Leader KK Raju Takes On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘దేవస్థానం భూములను పరిశ్రమలకు వాడటం దారుణం’

Apr 23 2026 5:18 PM | Updated on Apr 23 2026 6:54 PM

YSRCP Leader KK Raju Takes On Chandrababu Govt

విశాఖ:  దేవస్థానం భూములను పరిశ్రమలకు వాడటం దారుణమని విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. దేవస్థానం భూమునుల ధార్మిక కార్యక్రమాలకే వాడాలని, గూగుల్ సంస్థకు 106 ఎకరాల సింహాచలం భూమి ఇవ్వడం దారుణమన్నారు. 

పంచగ్రమాల సమస్య పరిధిలో ఉన్న భూమిని ఏవిధంగా గూగుల్‌కు కేటాయిస్తారు. పంచ గ్రామాల సమస్యను పరిష్కరించాలని ప్రజలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అప్పన్న స్వామి 106 ఎకరాలకు బదులు వేరే చోట గూగుల్‌కు భూములు ఇవ్వాలి. భక్తుల మనోభావాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. చంద్రబాబు పెద్ద అపచారానికి పాల్పడుతున్నారు. అప్పన్న స్వామి భూములకు చంద్రబాబు శఠగోపురం పెడుతున్నారు.

సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నారు. అప్పన్న స్వామికి జరిగే అన్యాయం పవన్ కళ్యాణ్‌కు కనిపించలేదా?, నేడు చంద్రబాబు శంకుస్థాపన చేసిన రెన్యూ పవర్ ప్రాజెక్ట్ వైఎస్ జగన్ కృషి. 

2023 సంవత్సరంలో రెన్యూ పవర్ ప్రాజెక్ట్ కు ఒప్పందం కుదిరింది. 4700 మెగావాట్ల ప్రాజెక్ట్ కు వైఎస్ జగన్ హయాంలో ఎంవోయూ కుదిరింది. చంద్రబాబు అబద్ధాలు చెపితే నమ్మడానికి పాతకాలం పేపర్ల యుగం కాదు. సోషల్ మీడియా యుగం’ అని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement