
రాజమండ్రి: రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల కోసం ఆమరణ దీక్షకు పిలుపునిచ్చిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అదే సమయంలో జక్కంపూడి రాజా అనుచరులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే ఆయన ఇంటివద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు.

తన హౌస్ అరెస్ట్‌పై జక్కంపూడి రాజా స్పందించారు. ‘ అర్ధరాత్రి 150 పోలీసులతో వచ్చి హౌస్ అరెస్టు చేశారు. దీక్ష చేయనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంది. పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదు. కార్మిక నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులతో కలిపి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం.’ అని ఆయన స్పష్టం చేశారు.