పేదల సొంతింటి కల నెరవేరుతుంది..

YSRCP Leader Devineni Avinash Fires On TDP Leaders - Sakshi

తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్

సాక్షి, విజయవాడ: తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయించారని దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నాల్గవ డివిజన్‌లో రూ.70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రోడ్డుని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పేదల సొంత ఇంటి కల నెరవేరుతుందని తెలిపారు. పేదలకు కల్లబొల్లి మాటలు చెప్పి క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులకు రాష్ట్ర ప్రజలే తగిన బుద్ధి చెబుతారని దేవినేని అవినాష్ మండిపడ్డారు. (చదవండి: ‘నిమ్మగడ్డ నిజస్వరూపం తెలిసిపోయింది’)

టీడీపీ హయాంలో ప్రజలకు గృహాలను ఇస్తామని స్థానిక నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు భారీగా డబ్బు వసూలు చేశారని దీనిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ జరపాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి అడిగినదే తడవుగా సీఎం వైఎస్‌ జగన్‌ రూ.250 కోట్లు అభివృద్ధికి కేటాయించారని, ఇంకా అనేక అభివృద్ధి ప్రణాళికలు వేసుకుని తన దగ్గరికి వచ్చి నిధులు తీసుకోవాల్సిందిగా ఆయన సూచించినట్లుగా స్థానిక నాయకులకు దేవినేని అవినాష్ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top