అక్రమ మట్టి తవ్వకాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన | YSRCP concerned over illegal sand mining | Sakshi
Sakshi News home page

అక్రమ మట్టి తవ్వకాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన

Mar 24 2026 11:48 PM | Updated on Mar 24 2026 11:54 PM

YSRCP concerned over illegal sand mining

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం పొట్టిలంకలో అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు కలిసి మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. ఎన్జీటి నిబంధనలను ఉల్లంఘిస్తూ సర్వే నెంబర్ 147లో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నదీ గర్భానికి తూర్పు పొడుస్తూ తవ్వకాలు జరగడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

దొంగ పట్టాలు సృష్టించి మట్టి తవ్వకాలు జరుపుతున్న కూటమి నేతలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీ మట్టి ఒక్కొక్కటి రూ.14,000కి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో మట్టి మాఫియా ఇంతగా చెలరేగిపోతున్నా.. స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం మౌనంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. ఈ అక్రమ తవ్వకాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడే దిశగా తక్షణ చర్యలు అవసరమని వైఎస్సార్‌సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement