కుప్పంలో టీడీపీ అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ

YSRCP Complaint to Election Commission on TDP Irregularities in Kuppam - Sakshi

సాక్షి, అమరావతి: కుప్పంలో టీడీపీ అక్రమాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాలు వైస్ చైర్మన్ నారాయణమూర్తి వినతిపత్రం అందజేశారు.

అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ఈ ఎన్నికల్లో చంద్రబాబు పడుతున్న పాట్లు చూస్తే జాలి కలుగుతోంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా 80శాతం ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కడుతున్నారు. కుప్పంలో చంద్రబాబు ఓటుకి రూ. 5వేలు ఇస్తున్నారు. అనేక రకాలుగా ప్రలోభ పెట్టేలా మాట్లాడుతున్నారు. ఏ కేసులో అయినా 48 గంటల్లో స్టే తెచుకుంటామంటూ లోకేష్ న్యాయ స్థానాల్ని అవమానించేలా మాట్లాడుతున్నారు' అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. 

చదవండి: (తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top