వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగింది: సజ్జల

YSR Vardhanthi Program At YSRCP Central Office - Sakshi

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమం

సాక్షి, అమరావతి: పాలకుడు ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి మహానేత వైఎస్సార్‌ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ 12వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, జూపూడి ప్రభాకర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగిందన్నారు. నాన్న వేసిన అడుగుకి పదడుగులు వైఎస్‌ జగన్‌ వేశారన్నారు. వైఎస్సార్‌ ఆశయాలకు శాశ్వత ముద్ర ఉండేలా వైఎస్‌ జగన్‌ పాలన చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ను బలోపేతం చేస్తూ ఆయన అడుగులో అడుగు వేద్దామని పిలుపునిచ్చారు.

తండ్రి బాటలో సీఎం జగన్‌: లక్ష్మీపార్వతి
పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్‌ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. వైఎస్సార్‌ మరణించినా.. ఆయన జ్ఞాపకాలు నిలిచే ఉన్నాయన్నారు. తండ్రి బాటలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారన్నారు. లోకేష్‌ అసమర్థుడని.. ఎప్పటికీ నాయకుడు కాలేడని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.

చదవండి:
మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌ 
గుండెనిండా ‘జగనన్న’ అభిమానం: కశ్మీర్‌ నుంచి యాత్ర 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top