Badvel Bypoll: మొత్తం 35 నామినేషన్లు దాఖలు

YSR kadapa: 35 Candidates File Papers For Badvel Bypoll - Sakshi

బద్వేలు ఉప ఎన్నిక.. ముగిసిన నామినేషన్ల ఘట్టం

సాక్షి, బద్వేలు అర్బన్‌: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్ధులు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం 35 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతన్‌గార్గ్‌ తెలిపారు. వీరిలో వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్‌ సుధ,కాంగ్రెస్‌ నుంచి పి.ఎం.కమలమ్మ, జె.ప్రభాకర్‌ రావు, బీజేపీ నుంచి పనతలసురేష్, ఎం.శివకృష్ణ, అంబేద్కర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌పార్టీ నుంచి ముత్యాలప్రసాద్‌రావు, హర్‌దమ్‌ మానవతవాది రాష్టీయదళ్‌పార్టీ నుంచి జి.విజయ కుమార్, సాంబశివరావు, నవరంగ్‌ కాంగ్రెస్‌పార్టీ నుంచి వెంకటేశ్వర్లు, జనసహాయకశక్తిపార్టీ నుంచి సగిలిసుదర్శనంలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా విజయకాంత్‌ గోపాలకాంత్, సి.బ్రహ్మయ్య, తిరుపాలుజయరాజు, ఆర్‌.ఇమ్మానియేల్, కోటపాటి నరసింహులు, కె.చిన్నమునెయ్య, రవి నామినేషన్లు దాఖలు చేశారు. 

జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు 
కడప సిటీ : బద్వేలు ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఇద్దరు ఎన్నికల పరిశీలకులు జిల్లాకు చేరుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. ఇందులో ఎన్నిక వ్యయ పరిశీలకులుగా షీల్‌ ఆసిస్‌ (ఐఆర్‌ఎస్‌), పోలీసు పరిశీలకులుగా పి.విజయన్‌ (ఐపీఎస్‌) వ్యవహరిస్తారని వివరించారు.  

చదవండి: (క్యాంబెల్‌: ఇద్దరు సీఎంలు జన్మించిన ఆసుపత్రి)    

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top