నేడు, రేపు వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన | YS Jagan to Visit Pulivendula: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నేడు, రేపు వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన

Sep 1 2026 3:40 AM | Updated on Sep 1 2026 3:40 AM

YS Jagan to Visit Pulivendula: Andhra Pradesh

రేపు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమానికి హాజరు 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పులి­­వెం­దులలో పర్యటించనున్నారు. 2న ఇడుపులపాయలో జరిగే దివంగత సీఎం వెఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తారు. తొలుత.. సెప్టెంబర్ 1వ తేదీ మధ్యా­హ్నం 12 గంటలకు వైఎస్‌ జగన్‌ పులివెందుల చేరుకుంటారు. 

అనంతరం భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బసచేస్తారు. రెండో తేదీ ఉదయం 7.45కు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం వైఎస్‌ జగన్‌ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement