
సాధారణ జనాల్లోనూ జగన్ పర్యటనపై చర్చ
వైఎస్ జగన్ రాక కోసం రైతుల ఎదురుచూపు
కర్ణాటకలోనూ జోరుగా చర్చ
చిత్తూరు: మామిడి రైతుల బాధలను చూసి వా రికి అండగా నిలిచి, గిట్టుబాటు ధర కోసం ప్ర భు త్వాన్ని ప్రశ్నించేందుకు ఈ నెల 9వ తేదీన జిల్లా లోని బంగారుపాళెం మామిడి మార్కెట్ వద్ద కు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా వా సులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటకు ప్రభుత్వం హెలీక్యాప్టర్‌కు అనుమతులివ్వకుండా ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రైతుల బాధల వినడానికి తా ను బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో బంగారుపాళేనికి వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జిల్లా వాసులే కాదు పొరుగునే ఉన్న కర్ణాటకలోని హొసకోటె, కోలార్, ముళబాగిళు, నంగిళి ప్రాంతాల్లోనూ జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం ఎదురుచూస్తున్నారు. బుధవారం రోడ్డు మార్గంలో ఏపీ మాజీ సీఎం వస్తున్నాడని తెలిసి ఇప్పటికే భారీ సంఖ్యలో కర్ణాటక వాసులు రోడ్డు పక్కన బ్యానర్లకు ఆర్డర్ ఇచ్చేశారు. కర్ణాటకలోనూ స్వాగతం పలి కేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోౖవైపు జిల్లా లోని పడమటి ప్రాంత రైతులు, వైఎస్సార్‌సీపీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారుపాళెంలో హెలీప్యాడ్‌కు అనుమతులు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ రైతు ల కష్టాల కోసం జగన్ వస్తే కూటమి ప్రభుత్వం ఎందుకు హడలిపోతుందనే ప్రశ్న తలెత్తుతోంది.
అనుమతి వెనుక ఇంత తతంగమా?
బెంగళూరు నుంచి బంగారుపాళెం వరకు దాదాపు 150 కిలోమీటర్లు జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డు మార్గంలో వస్తే హైవేలో పెద్దసంఖ్యలో వాహనాలు, భారీ గా తరలివచ్చే జనంతో వైఎస్సార్ సీపీకి జాతీయ స్థాయిలో భారీ మైలేజీ వస్తుందని నిఘా వర్గాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసినట్టు తెలిసింది. దీంతో హెలిప్యాడ్‌కు అనుమతిలిస్తేనే మేలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. చేసేది లేక అధి కారులు హెలీఫ్యాడ్‌కు అనుమతులు ఇచ్చారనే మాట ఇప్పుడు జనం నోట నానుతోంది. ఏదేమైనా జగన్‌మోహన్‌రెడ్డి ఎలా వచ్చినా బంగారుపాళెం కార్యక్రమానికి వెళ్లేందుకు జనం సిద్ధంగా ఉండడం విశేషం.
వైఎస్. జగన్ పర్యటన రేపు
చిత్తూరు అర్బన్: మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ నా యకులు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మా మిడి రైతులు పడుతున్న కష్టాన్ని తెలుసుకోవడానికి బంగారుపాళెం మార్కెట్ యార్డులో రైతు లతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
- ఉదయం10 గంటలకు బెంగళూరు నుంచి హెలిక్యాఫ్టర్‌లో బంగారుపాళేనికి బయలుదేరుతారు.
- 10.50 గంటలకు బంగారుపాళెం మండలం కొత్తపల్లె హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
- 11 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 11.20 గంటలకు రోడ్డు మార్గంలో బంగారుపాళెం మార్కెట్ యార్డుకు చేరుకుంటారు.
- 11.20 నుంచి 12.20 గంటల వరకు మామిడి రైతుల కష్టాలపై బంగారుపాళెం మామిడి యార్డులో రైతులతో నేరుగా మాట్లాడుతారు.
- 12.20 గంటలకు మార్కెట్ యార్డు నుంచి బ యలుదేరి 12.35 గంటలకు హెలిప్యాడ్ వ ద్దకు చేరుకుంటారు.
- 12.45 గంటలకు బంగారుపాళెం కొత్తపల్లెలోని హెలిప్యాడ్ నుంచి బెంగళూరుకు బయలుదేరి, మధ్యాహ్నం 1.35 గంటలకు బెంగళూరుకు చేరుకుంటారు.