
సాక్షి,విశాఖ: వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో కేజీహెచ్ వద్ద పోలీస్ సీపీ శంఖ బ్రత బాగ్చి ఓవర్ యాక్షన్ చేశారు.

కేజీహెచ్ వద్ద వైఎస్ జగన్ ప్రెస్‌మీట్‌కు అనుమతించలేదు. ఆస్పత్రి నుంచి మీడియాను బయటకు పంపించేశారు. వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించేందుకు వస్తున్న వైఎస్ జగన్ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వీలు లేదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. కేజీహెచ్ పీడియాట్రిక్ వార్డు నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఆదేశించారు.

మరోవైపు కేజీహెచ్‌కు చేరుకున్న వైఎస్ జగన్..కామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించారు. బాధిత విద్యార్థులతో మాట్లాడారు. పిల్లల ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.