సాక్షి, అమరావతి: సీఎంఎస్3 ఉపగ్రహంతో కూడిన ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలకు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశ అంతరిక్ష విజయాల్లో ఇదొక మైలురాయి అని కొనియాడారు.
ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్ష సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే రాబోయే దశాబ్దాలకు ఇంటర్‌నెట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తుందని వైఎస్ జగన్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.


