సాక్షి,తాడేపల్లి: చెస్ క్రీడాకారుడు, గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. జర్మనీ వేదికగా జరిగిన 43వ మున్స్టర్లాండ్ ఓపెన్–2026 చెస్ టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించి, ఛాంపియన్‌గా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు.
విజయవాడకు చెందిన లలిత్ బాబు తన అసాధారణ ప్రతిభ, పట్టుదలతో అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ చెస్ క్రీడకు ఆయన గర్వకారణంగా నిలిచారని, వర్ధమాన యువ క్రీడాకారులకు లలిత్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
భవిష్యత్తులోనూ లలిత్ బాబు మరిన్ని గొప్ప విజయాలు సాధించి, రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
A proud moment for Andhra Pradesh and Indian chess! Grandmaster M. R. Lalith Babu, from Vijayawada, has won the 43rd Münsterland Open 2026 in Germany. With skill and determination, he delivered a strong performance to claim the title. Well done, Lalith Babu! Your success will encourage many young players to pursue their dreams. Wishing you many more victories ahead! @lalitrohit93
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 26, 2026


