World Fisheries Day: మత్స్యకారులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు | World Fisheries Day: AP CM YS Jagan Wishes To Fishermen | Sakshi
Sakshi News home page

World Fisheries Day: మత్స్యకారులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

Nov 21 2021 4:36 PM | Updated on Nov 21 2021 4:48 PM

World Fisheries Day: AP CM YS Jagan Wishes To Fishermen - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో డీజిల్‌పై సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

‘‘మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు. డీజిల్ సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకూ, కొత్త హార్బర్ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడంలోనూ ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా నిలిచింది. ఇక పైనా మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది.’’ అని సీఎం ట్వీట్‌ చేశారు.
చదవండి: ఆ ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement