చంద్రబాబుకు నిరసన సెగ

Women Protest Against Chandrababu Naidu Lokesh Stand On Capital - Sakshi

సాక్షి, గుంటూరు: ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అమరావతిలో చేదు అనుభవం ఎదురైంది. మందడంలో జరుగుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షా శిబిరం వద్దకు రాగానే నిరసన సెగ తగిలింది. పెద్ద ఎత్తున మహిళలు నల్లజెండాలు ప్రదర్శిస్తూ చంద్రబాబు, లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాబు దళిత ద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒక రాజధాని వద్దు- మూడు రాజధానులు కావాలి’’ అంటూ ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేశారు. అదే విధంగా అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలపై కోర్టులో  వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ నిరసనకారులు డిమాండ్‌ చేశారు.(చదవండి: ఏపీ అసెంబ్లీ 5వ రోజు: లైవ్‌ అప్‌డేట్స్‌)

కాగా అభివృద్ధి వికేంద్రీకరణకై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అమరావతి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా మందడంలో దీక్షాశిబిరం ఏర్పాటు చేసిన స్థానికులు.. టీడీపీ కుట్రలను ఎండగడుతున్నారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అదే విధంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా హైకోర్టులో టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌ వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. ప్రతిపక్షం అడ్డుపడుతున్న తీరుపై భగ్గుమంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top