యువతిపై పెట్రోలు దాడి: దిశా యాప్‌తో బాధితురాలిని రక్షించాం | Vizianagaram: AP Ministers React On Petrol Attack On Woman Incident | Sakshi
Sakshi News home page

యువతిపై పెట్రోలు దాడి: దిశా యాప్‌తో బాధితురాలిని రక్షించాం

Aug 20 2021 3:45 PM | Updated on Aug 20 2021 6:27 PM

Vizianagaram: AP Ministers React On Petrol Attack On Woman Incident - Sakshi

సాక్షి, విజయనగరం: పూసపాటిరేగ మండలం చౌడవాడ గ్రామంలో ప్రియుడు పెట్రోలు దాడిలో గాయపడిన బాధితురాలిని ఏపీ మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ పరామర్శించారు.  ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. దిశా యాప్‌ ద్వారా పోలీసులు బాధితురాలిని రక్షించారని వెల్లడించారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

కాగా హత్యాయత్నం చేసిన నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ దీపికా పాటిల్‌ వెల్లడించారు. దిశ యాప్‌ సమాచారంతో బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించామని బాధితురాలికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. వారం రోజుల్లో ఛార్జ్‌షీట్ వేస్తామని, నిందితుడికి సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement