జయంతిని వర్ధంతి అంటారా?  | Viswabrahmins Demands From Chandrababu and ABN Channel | Sakshi
Sakshi News home page

జయంతిని వర్ధంతి అంటారా? 

Sep 21 2020 10:03 AM | Updated on Sep 21 2020 10:09 AM

Viswabrahmins Demands From Chandrababu and ABN Channel - Sakshi

సాక్షి, గుంటూరు : ఈనెల 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా జయంతికి బదులుగా వర్ధంతి, విశ్వబ్రాహ్మణులకు బదులుగా నాయీ బ్రాహ్మణులుగా చంద్రబాబు పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపినట్లుగా ఏబీఎన్‌ టీవీ చానల్‌లో స్క్రోలింగ్‌ ప్రసారమైందని విశ్వబ్రాహ్మణ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం నేత కె.మయబ్రహ్మాచారి ఆదివారం గుంటూరు కొత్తపేటలోని మూడంతస్తుల హోర్డింగ్‌ పైకి ఎక్కి నిరసన తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బ్రహ్మాచారితో మాట్లాడి కిందికి దించి, అతన్ని స్టేషన్‌కు తరలించారు. విశ్వబ్రాహ్మణ సంఘీయుల మనోభావాలు దెబ్బతీసిన ఏబీఎన్‌ యాజమాన్యం, ప్రతిపక్ష నేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలని బ్రహ్మాచారి డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు బీసీ కులాలపై చిన్నచూపు తగదని హితవు పలికారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement