
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలోని భరద్వాజ తీర్థంలో 13 అడుగుల కొండచిలువ ఆదివారం మేకను మింగేసింది. అది కదలలేని స్థితిలో ఉండగా ఆలయ ఉద్యోగులు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు కొండచిలువను పట్టుకుని, మింగిన మేక పిల్లను కక్కించి, రామాపురం అటవీ ప్రాంతంలో వదిలివేశారు. కొండచిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.