ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలి

Vijayawada Police Are Imposing Fines Who Dont Follow Covid Rules - Sakshi

సాక్షి, విజయవాడ: కోవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై విజయవాడ నగర పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. సోమవారం రోజున రామవరప్పాడులో ట్రాఫిక్‌ ఏడీసీపీ రవిచంద్ర స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి పోలీసులు జరిమానా విధించి మాస్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏడీసీపీ రవిచంద్ర మాట్లాడుతూ.. నెల రోజుల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న 10,805 మందిపై కేసులు నమోదు చేశాము. మొత్తంగా వారికి రూ. 8,83,600 జరిమానా విధించాము. కరోనా కట్టడికి ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలి. నిర్లక్ష్యం వహించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాము' అని రవిచంద్ర పేర్కొన్నారు. (పరిశ్రమలతో పాటు భద్రత ముఖ్యం: సీఎం జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top