విశాఖలో జాబ్‌మేళాను ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి

Vijaya Sai Reddy YSRCP Job Mela Started at Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏయూ ప్రాంగణంలో వైఎస్సార్‌సీపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్‌ మేళా కార్యక్రమాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారు. ప్రభుత్వం రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించాలని సీఎం భావిస్తున్నారు. జాబ్ మేళా అనేది నిరంతర ప్రక్రియ. చదువుకున్న ప్రతి వ్యక్తి నిరుద్యోగిగా మిగుల కూడదు అనేది సీఎం లక్ష్యం.

దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని పని వైఎస్సార్‌సీపీ చేస్తోంది. గ్రామ, వార్డు వాలంటరీ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు సీఎం కల్పించారు. నేడు, రేపు జాబ్ మేళా జరుగుతుంది. అవరమైతే ఎల్లుండి కూడా నిర్వహిస్తాము. 208 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. ఒక్కొక్కరు ఐదు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాము. 77 వేల మంది ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరులో వచ్చే వారం జరగాల్సిన జాబ్ మేళా సీఎం ఢిల్లీ పర్యటన కారణంగా ఒక వారం వాయిదా పడింది అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 

ఐటీశాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఎంపీ విజయ సాయిరెడ్డి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. జాబ్‌ మేళా ద్వారా సుమారు 25 వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయం ద్వారా 1.50లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా 2.50 లక్షల మందికి అవకాశం కల్పించారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తాము అని మంత్రి గుడివాడ అమరనాథ్‌ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top