‘ఆంధ్రకేసరి’ నైతిక నిష్ట చిరస్మరణీయం

Vice President Venkaiah Naidu Tribute To Tanguturi Prakasam Pantulu - Sakshi

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సాక్షి, ఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. న్యాయకోవిదుడిగా, పత్రికా సంపాదకుడిగా ప్రకాశం పంతులు స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుండి నడిపిన తీరు, ఆయన చూపిన తెగువ, ధైర్య సాహసాలే గాక ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన నైతిక నిష్ట చిరస్మరణీయం అని ఆయన ట్విటర్‌లో ప్రస్తుతించారు.

సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో తుపాకీ గొట్టానికి గుండెను అడ్డుపెట్టి ప్రజలందరి హృదయాల్లో ‘ఆంధ్రకేసరి’గా నిలిచిపోయిన ఆయన జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షిస్తున్నానని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top