భవానీపురం స్టేడియంను త్వరితగతిన పూర్తి చేస్తాం: వెల్లంపల్లి | Vellampalli Srinivas Inaugurates CC Roads In Vijayawada West Constituency | Sakshi
Sakshi News home page

భవానీపురం స్టేడియంను త్వరితగతిన పూర్తి చేస్తాం: వెల్లంపల్లి

Jul 10 2021 10:26 AM | Updated on Jul 10 2021 10:29 AM

Vellampalli Srinivas Inaugurates CC Roads In Vijayawada West Constituency - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, కృష్ణా: విజయవాడ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఆయన శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రూ.కోటి 40 లక్షలతో సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన గడపగడపకు వెళ్లి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ అభివృద్ధిపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించారని వెల్లంపల్లి తెలిపారు. భవానీపురం స్టేడియంను త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement