యారాడ బీచ్‌లో ఇద్దరు నేవీ ఉద్యోగుల గల్లంతు

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని యారాడ బీచ్‌లో స్నానానికి దిగిన ఇద్దరు నేవీ సిబ్బంది గల్లంతయ్యారు. వివరాల్లోకెళ్తే.. ఇండియన్ నేవీ షిప్ సుమిత్రలో పనిచేస్తున్న 30 మంది నావికా సిబ్బంది ఆదివారం యారాడ బీచ్ సందర్శనకు వెళ్లారు. వీరిలో జగత్ సింగ్, శుభమ్ అనే ఇద్దరు నౌకా సిబ్బంది సముద్రంలో స్నానానికి దిగారు. అయితే అలల తాకిడికి ఇద్దరు గల్లంతయ్యారు. వెంటనే నావీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా జగత్ సింగ్ మృతదేహం లభించింది. శుభం ఆచూకీ ఇంకా లభించలేదు. అతనికోసం హెలికాప్టర్ ద్వారా నేవీ సిబ్బంది గాలిస్తున్నారు. సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. (వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే..?!)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి