జూన్‌ 1 నుంచి అలిపిరి కాలినడక మార్గం మూత

TTD To Close Alipiri Footpath From June 1 - Sakshi

పైకప్పు పునర్నిర్మాణ పనుల కోసమే: టీటీడీ

తిరుమల: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జూన్‌ 1 నుంచి జూలై 31వ తేదీ వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. అయితే, కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని కోరింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.

సుందరకాండ పారాయణం
ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సుందరకాండ 58వ సర్గలో గల 167 శ్లోకాలను వేద పండితులు అఖండ పారాయణం చేశారు.

చదవండి: పంపా క్షేత్రమే హనుమంతుని జన్మస్థలం 
శరణ్య.. నువ్వు డాక్టర్‌ కావాలమ్మా!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top