Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Trending Telugu Topics Evening News Roundup 11th October 2022 - Sakshi

1. పొగాకు రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్‌
ధాన్యం సేకరణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. రాజాసింగ్‌ పీడీయాక్ట్‌ కేసు.. తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ పీడీ యాక్టు కేసుపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ఈనెల 20లోపు ఎట్టిపరిస్థితుల్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. టీడీపీతో బీజేపీ పొత్తు లేదన్నాక వారిలో మరింత అసహనం!
ఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియాను ఎల్లో అంటే పచ్చ మీడియాగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ మాత్రమే అబివర్ణిస్తుంటుంది. తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ పదాన్ని వాడడం విశేషమే. మూడు మీడియా సంస్థలు ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నిత్యం కధలు తయారు చేసి జనం మీదకు వదలుతున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. చావనైనా చస్తా కానీ.. ఆ పని మాత్రం చేయను: కేటీఆర్
బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను క‌ట్టబెట్టినట్లు.. న‌ల్ల‌గొండ జిల్లా అభివృద్ధికి కూడా ఆ స్థాయిలో నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. గుంతల రోడ్డు.. పెద్దల కాన్వాయ్‌కి దారివ్వబోయి పేదోడి వాహనం బోల్తా
ఉత్తర్‌ప్రదేశ్ సీతాపుర్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుంతలమయం, వర్షపు నీటితో కూడిన రోడ్డుపై జిల్లా మెజిస్ట్రేట్‌ కాన్వాయ్ వెళ్తుండగా.. దానికి ఆటోరిక్షా(ఈ-రిక్షా) సైడ్ ఇవ్వబోయింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. దిగ్గజ నేతకు అంతిమ వీడ్కోలు.. జనసందోహమైన సైఫాయ్‌
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్‌లో జరుగుతున్నాయి. అంతిమ యాత్రకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఎన్నారై కుటుంబ హత్యోదంతం.. ఆ మానవ మృగాన్ని వదలొద్దు!
ఎనిమిది నెలల పసికందు అనే కనికరం లేకుండా.. పాత గొడవలు పట్టుకుని ఎన్నారై కుటుంబాన్ని పొట్టనబెట్టన బెట్టుకున్న మానవ మృగంపై నేరారోపణలు నమోదు అయ్యాయి. నిందితుడు మాన్యుయెల్‌ సల్గాడో(48)పై నాలుగు అభియోగాలు, అదనంగా మరో రెండు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్‌ అదిరింది.. రికార్డ్‌ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ!
భారత ఆటోమొబైల్‌ రంగంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌(EV) మార్కెట్‌ రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్రం ఆదేశాలు, ఇంధన లభ్యతతో పాటు వాటి ధరలు పెరుగదల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కంపెనీలు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు అడుగులు వేస్తున్నాయి. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. తిప్పేసిన స్పిన్నర్లు.. సౌతాఫ్రికా చెత్త రికార్డు
టీమిండియాతో ఇవాళ (అక్టోబర్‌ 11) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ జట్టు వన్డేల్లో నాలుగో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. నేటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ టీమ్‌.. 27.1 ఓవర్లలో కేవలం 99 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. కంటెంట్‌ రేవంత్‌ వెనకాల పరిగెడుతోంది..
ప్రతి బిగ్‌బాస్‌ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌, టాస్కులు అంటూ వాటి వెనక పరుగులు తీస్తుంటారు కంటెస్టెంట్లు. కానీ ఈ సీజన్‌లో మాత్రం అదిగో కెమెరా, ఇదిగో కంటెంట్‌ అంటూ కాస్త అతి చేస్తున్నారు. ఆరో సీజన్‌ మొదలై ఐదు వారాలు పూర్తవుతున్నా ఇప్పటికీ కొందరు పూర్తిగా గేమ్‌లో దిగనేలేదు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top