Tirumala: 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirumala Srivari Brahmotsavam 2022: Ankurarpana, Garuda Seva, Koil Alwar Thirumanjanam - Sakshi

26న అంకురార్పణ, అక్టోబర్‌ 1న గరుడసేవ 

తిరుమల: రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సమాయత్తమవుతోంది. ఈనెల 27 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు ఆలయ మాడ వీధుల్లో వాహన సేవలు జరగనున్నాయి. 26న అంకురార్పణ, అక్టోబర్‌ 1న గరుడసేవ నిర్వహించనున్నారు. 

ఇక కోవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి మాడ వీధుల్లో వాహన సేవలు జరగనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశముంది. ఈ క్రమంలో వారి కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈనెల 20న ఉ. 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. (క్లిక్‌: ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు.. విజయవాడలో తొలిస్టాల్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top