నేడు దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌ను స్మరించుకుంటూ రాజకీయ నేతలు, ప్రముఖులు, అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
కాకినాడ..
- కాకినాడ రూరల్‌లో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం.
- వైఎస్సార్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు.
- కన్నబాబు కామెంట్స్..
- వైఎస్సార్ అంటే ఒక చరిత్ర.
- ప్రతీ సంక్షేమ పధకంలో వైఎస్సార్ గుండె చప్పుడు వినిపిస్తుంది.
- వైఎస్సార్ మరణించినా ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారు
- పోలవరం, జంజావతి, సోమశిల ఏ సాగునీటి ప్రాజెక్టు చూసిన వైఎస్సార్ కృషి, పట్టుదల కనిపిస్తాయి.
- ఏపీ ప్రజల జీవనాడైన పోలవరం ప్రాజెక్టును 2005లో వైఎస్సార్ ప్రారంభించారు.
- వైఎస్సార్ ఆశయాలను అమలు చేస్తూ ఒక్క రూపాయి అవినీతి లేకుండా వైఎస్ జగన్ సంక్షేమాన్ని ప్రజలకు అందించారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ నివాళులు..
- విజయవాడ..
- దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఎక్స్ వేదికగా వైఎస్సార్‌కు నివాళులు అర్పిస్తూ పోస్టు పెట్టిన ఏపీ గవర్నర్
- ప్రజల సంక్షేమం కోసం తనను తాను అంకితం చేసుకున్న దూరదృష్టి గల నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి
- వ్యవసాయం, వైద్య సేవలు, విద్య మరియు సామాజిక సంక్షేమ రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer offered tributes to Dr. Y.S. Rajasekhara Reddy,former Chief Minister of united Andhra Pradesh on his death anniversary.The Governor said Dr. Rajasekhara Reddy was a visionary leader who dedicated himself to the welfare of the people. pic.twitter.com/DFG45eHBKG
— Lok Bhavan, Andhra Pradesh (@governorap) September 2, 2026
తాడేపల్లి..
వైఎస్సార్‌సీపీ కేంద్రం కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం
కృష్ణా నదీ జలాలతో వైఎస్సార్ విగ్రహానికి జలాభిషేకం
పులిచింతల నుండి తెచ్చిన నీటితో జలాభిషేకం చేసిన పార్టీ నేతలు
బీడు భూముల్లో సిరులు పండించినందున ధాన్యాభిషేకం
హాజరైన పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు సహా పలువురు పార్టీ నేతలు

తిరుపతి..
భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్..
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
మానవతా మూర్తిగా ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్మరణీయం
వైఎస్సార్ పాలనను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు .
‘మళ్లీ ఎప్పుడు వస్తావు రాజన్నా’ అంటూ నేటికీ ప్రజల తలపులు
వైఎస్సార్ మరణం యావత్ తెలుగు ప్రజలకు తీరని విషాదం.
వైఎస్సార్ మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు
వైఎస్సార్ ఉండి ఉంటే రాష్ట్ర సౌభాగ్యం మరింత అభివృద్ధి చెందేది
వైఎస్సార్ ఆశయాల సాధనకు జగన్‌మోహన్ రెడ్డి కంకణబద్ధులు
ప్రతికూల ప్రచారాలను ఎదుర్కొంటూ జగన్ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు
వైఎస్సార్ ఆశయాలను సాధించడమే తమ ప్రధాన లక్ష్యం.
జగన్ నాయకత్వాన్ని మళ్లీ రాష్ట్రంలోకి తీసుకురావాలని ప్రతిజ్ఞ
వైఎస్సార్ కుటుంబం, అభిమానులు, పార్టీ నేతల కన్నీటి నివాళులు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్..
ప్రజల గుండె చప్పుడు, పేదల కన్నీళ్లు తుడిచిన ప్రజల నాయకుడు వైఎస్సార్‌కు ఘన నివాళులు.
మీ నవ్వు, మీ అడుగుజాడలు, పేదవాడి కడుపు నింపిన మీ సంక్షేమ బాట..
మీ ఆశయాలే మా ఊపిరి, మీ ప్రజాపాలనే మా సంకల్పం.
మిమ్మల్ని ఎప్పటికీ మరువం రాజన్న..
జోహార్ వైఎస్సార్.
ప్రజల గుండె చప్పుడు... పేదల కన్నీళ్లు తుడిచిన ప్రజల నాయకుడు, దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
మీ నవ్వు, మీ అడుగుజాడలు, పేదవాడి కడుపు నింపిన మీ సంక్షేమ బాట, మీ ఆశయాలే మా ఊపిరి, మీ ప్రజాపాలనే మా సంకల్పం.
మిమ్మల్ని ఎప్పటికీ మరువం… pic.twitter.com/eq6eiAOLwV— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) September 2, 2026
మంత్రి కొండా సురేఖ కామెంట్స్..
సకల జనులహితుడు..
సంక్షేమ పథకాల సారథుడు..
మరపురాని మహానేత..
అభివృద్ధి ప్రదాత..
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు.
వైఎస్సార్ చూపిన బాట..
ప్రజాసేవకు స్ఫూర్తిదాయకం
సంక్షేమం ప్రతి గడపకు చేరాలి..
అభివృద్ధి ప్రతి ప్రాంతానికి అందాలి..
పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపించాలి..
అనే ఆలోచనతో ప్రజల కోసం పనిచేసిన
డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా ప్రస్థానం
ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.
ఆ మహనీయుని వర్ధంతి… pic.twitter.com/9knw4cfUNs— Konda Surekha (@iamkondasurekha) September 2, 2026
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం
కంట్రోల్ రూమ్ వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు
వైఎస్సార్ విగ్రహానికి పోలవరం నీటితో జలాభిషేకం చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్..
ఏపీలో ఏ నీటి ప్రాజెక్టు చూసినా వైఎస్సార్ గుర్తుకొస్తారు
వైఎస్సార్ జలయజ్ఞం ప్రారంభిస్తే చంద్రబాబు అవహేళన చేశారు
ఉచిత కరెంట్ ఇస్తామంటే బట్టలు ఆరేసుకోవాలని అవహేళన చేశారు
రైతులను మోసం చేసిన వ్యక్తి, ప్రాజెక్టులను నిర్వీర్యం చేసింది చంద్రబాబు
ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కట్టింది నేనే అని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం
దేవినేని అవినాష్ కామెంట్స్..
సంక్షేమ రథసారథి వైఎస్సార్
జలయజ్ఞంతో సాగు, తాగునీటి అవసరాలు తీర్చిన మహనీయుడు వైఎస్సార్
పోలవరం నీటితో వైఎస్సార్‌కు జలాభిషేకం చేశాం
చంద్రబాబు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా ప్రాజెక్టులంటే వైఎస్సార్ మాత్రమే గుర్తుకొస్తారు
తండ్రిబాటలో నడిచి గొప్ప నాయకుడిగా జగన్ పాలన చేశారు
వైఎస్ జగన్ వెంట నిలుస్తాం.. 2029లో జగన్‌ను సీఎం చేసుకుంటాం
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం ప్రారంభించిన గొప్ప నేత వైఎస్సార్
వైఎస్సార్ తన పాలనలో రికార్డు సృష్టించారు
చంద్రబాబు లుంగీ కట్టుకుని ప్రదక్షిణలు చేస్తే సరిపోదు
వెలిగొండ ఎవరి హయాంలో ముందుకు సాగిందో ప్రజలకు తెలుసు
పులిచింతలకు శంకుస్థాపన చేసి ఎవరు పూర్తి చేశారో ప్రజలకు తెలుసు
పోలవరం కుడి, ఎడమ కాలువలు తవ్వుతున్నప్పుడు అనుమతులు లేవని అడ్డుకున్నది చంద్రబాబు
ఏ మొహం పెట్టుకుని వైఎస్సార్ తవ్విన కాలువల్లో నీరు పారిస్తున్నామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారు
ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మంచి చేసింది వైఎస్సార్
ఆరోగ్యశ్రీ ని నిర్వీర్యం చేసింది చంద్రబాబు
సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యేల వద్దకు వెళ్తున్న వారిని పార్టీ మారాలని వేధిస్తున్నారు
తక్షణమే ఇలాంటి పనులను మానుకోండి
వైఎస్సార్‌కు విజయవాడ అంటే అమితమైన ప్రేమ
మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కామెంట్స్..
ప్రతీ ఒక్కరి గుండెల్లో నిలిచిపోయిన మహానేత వైఎస్సార్
పేదల గుండెకు భద్రతనిచ్చింది వైఎస్సార్
ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ ద్వారా చరిత్ర సృష్టించారు
మన పిల్లలు ఉన్నత చదువులు చదివారంటే ఇతర దేశాల్లో ఉన్నారంటే వైఎస్సార్ పుణ్యమే
చంద్రబాబు పొర్లుదండాలు పెడుతున్నారు
మీరెన్ని పొర్లుదండాలు పెట్టినా క్రెడిట్ చోరీ చేసినా ప్రజలు నమ్మరు
పూనూరు గౌతమ్ రెడ్డి కామెంట్స్..
ప్రజలకు మేలు చేసిన మహనీయుడు వైఎస్సార్
అందుకే ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు
వైఎస్సార్ ఆశయాలతో జగన్ ముందుకు వెళ్తున్నారు.


