Evening Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం | Telugu Breaking News Online Telugu News Today 25th July 2022 | Sakshi
Sakshi News home page

Evening Top 10 Telugu News: తెలుగు తాజా వార్తలు 10

Jul 25 2022 6:01 PM | Updated on Jul 25 2022 6:18 PM

Telugu Breaking News Online Telugu News Today 25th July 2022 - Sakshi

తొలకరి మొదలైంది.. రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ చేరుతోంది. దోమలు వ్యాప్తి చెందుతుండడంతో సీజనల్‌ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

1. కోనసీమ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలి: సీఎం జగన్‌
రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సమీక్ష జరిపారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. తెలంగాణ అప్పులు రూ. 3 లక్షల 12వేల కోట్లు.. కేసీఆర్‌ సర్కార్‌పై మండిపడ్డ ఉత్తమ్‌
రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర సోమవారం ప్రకటించింది.  గత మూడేళ్లలో రాష్ట్రాలు తీసుకున్న అప్పుల జాబితాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రకటించారు. తెలంగాణ, ఏపీ అప్పలు జాబితాను విడుదల చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. డీఎస్‌ను పరామర్శించిన వైఎస్‌ షర్మిల.. ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ
రాజ్యసభ మాజీ ఎంపీ డి.శ్రీనివాస్‌ను వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సోమవారం పరామర్శించారు. డీఎస్‌ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తి కరమైన చర్చ సాగింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం.. ‘భారత్‌కు ఉద్వేగభరిత క్షణం’..
దేశ అత్యున్నత పీఠంపై ద్రౌపదీ ముర్ము ఆసీనులయ్యారు. భారత 15వ రాష్ట్రపతిగా ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో ప్ర‌మాణ స్వీకారోత్స‌వం జ‌రిగింది.  ఈ సందర్భంగా  దేశం నలుమూలల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మంత్రిగారి లైఫ్ స్టైల్ మామూలుగా లేదుగా.. కుక్కల కోసం ఖరీదైన ఫ్లాట్‌.. అర్పితకు కానుకలు!
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణలో ఆయనకు సంబంధించిన మరిన్ని అక్రమాస్తులు బయటపడుతున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. సిరీస్‌ గెలిచినా.. ఆ విషయంలో అయ్యర్‌కు నిరాశ! ద్రవిడ్‌ సర్‌ చాలా టెన్షన్‌ పడ్డారు!
‘‘రెండో వన్డేలో మంచి స్కోరు నమోదు చేయడం పట్ల సంతోషంగా ఉన్నాను. అయితే, నేను అవుటైన విధానం కాస్త నిరాశపరిచింది. తదుపరి మ్యాచ్‌లో మరింత మెరుగ్గా రాణించి సెంచరీ సాధించాలని కోరుకుంటున్నా’’ అని టీమిండియా యువ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఒకపుడు కాలేజీ డ్రాపవుట్‌, మరిపుడు రోజుకు రూ. 27 కోట్లు దానం
టెక్ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు, అజీమ్ ప్రేమ్‌జీ జూలై 24న తన 77వ పడిలోకి అడుగు పెట్టారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు, ఆసియాలోని అగ్రశ్రేణి దాతృత్వవేత్తలలో ఒకరుగా పేరుగాంచిన అజీం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. థియేటర్‌ ఓనర్స్‌, ఎగ్జిబిటర్స్‌తో తెలుగు నిర్మాతల మండలి అత్యవసర సమావేశం
తెలుగు నిర్మాత మండలి ప్రత్యేక సమావేశం ముగిసింది. టికెట్‌ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో కొత్త సినిమాలు వంటి అంశాలపై చర్చించేందుకు టాలీవుడ్‌ నిర్మాతల మండలి సోమవారం అత్యవసరంగా భేటీ అయింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. సీజన్‌ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు
తొలకరి మొదలైంది.. రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ చేరుతోంది. దోమలు వ్యాప్తి చెందుతుండడంతో సీజనల్‌ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement