కోనసీమ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

CM YS Jagan Konaseema District Visit Schedule On July 26th - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు.
చదవండి: చంద్రబాబు ఏం చేశాడో తెలుసా?.. వాస్తవాలు చెప్పిన మంత్రి అంబటి

ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు, అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top