వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం | Tdp Mp Vemireddy Prabhakar Reddy Had A Bitter Experience | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం

Nov 3 2024 8:35 PM | Updated on Nov 3 2024 9:00 PM

Tdp Mp Vemireddy Prabhakar Reddy Had A Bitter Experience

టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం జరిగింది. జిల్లా సమీక్షా సమావేశంలో సరైన గౌరవం ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం జరిగింది. జిల్లా సమీక్షా మండలి సమావేశంలో సరైన గౌరవం ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎండీ ఫరూక్, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అధికారులు ఆహ్వానించారు.

అయితే, మంత్రులకు బొకేలు ఇచ్చి ఎంపీని అధికారులు పట్టించుకోలేదు. ప్రభాకర్‌రెడ్డిని ఆనం రామనారాయణరెడ్డి సముదాయించారు. అయినా కూడా వేమిరెడ్డి పట్టించుకోకుండా అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement