AP: పచ్చమూకల దాడి.. వైఎస్‌ఆర్‌సీపీ నేతకు తీవ్ర గాయాలు | Tdp Leaders Attack On Palnadu Ysrcp Leader Sambireddy | Sakshi
Sakshi News home page

పల్నాడు: పచ్చమూకల దాడిలో వైఎస్‌ఆర్‌సీపీ నేతకు తీవ్ర గాయాలు

Jul 23 2024 8:05 PM | Updated on Jul 24 2024 7:01 AM

Tdp Leaders Attack On Palnadu Ysrcp Leader Sambireddy

సాక్షి,పల్నాడు జిల్లా: ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు మళ్లీ బరితెగించారు. వైఎస్‌ఆర్‌సీపీ నేత, క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డిపై 15 మంది మాస్కులు వేసుకున్న టీడీపీ నాయకులు దారికాచి దాడి చేశారు. 

మంగళవారం(జులై 23)సాయంత్రం గుంటూరు నుంచి తాళ్లూరు వెళ్తుండగా ఉంగుటూరు వద్ద మాటువేసిన టీడీపీ నాయకులు సాంబిరెడ్డి కారుపై దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో కారు ధ్వంసమైంది. సాంబిరెడ్డి కాళ్లు చేతులపై ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో సాంబిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను గుంటూరులోని ఓ ప్రైవేట్‌  ఆస్పత్రికి తరలించారు.

 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement