హడ్కో నుంచి మరో రూ.5,000 కోట్ల అప్పు | TDP govt will borrow Rs 5000 crore from HUDCO: Andhra pradesh | Sakshi
Sakshi News home page

హడ్కో నుంచి మరో రూ.5,000 కోట్ల అప్పు

Nov 4 2025 3:59 AM | Updated on Nov 4 2025 4:00 AM

TDP govt will borrow Rs 5000 crore from HUDCO: Andhra pradesh

ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ ఉత్తర్వులు  

కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్‌ బయట అప్పులు రూ.55,383 కోట్లకు చేరిక 

ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఎడాపెడా అప్పులు తీసుకుంటూ ప్రజల­పై భారం మోపుతున్నారు. తాజాగా ఏపీ పవర్‌ ఫై­నాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీపీఎఫ్‌సీఎల్‌) సంస్థలకు అవసరమైన బొగ్గు, విద్యుత్‌ కొనుగోలు కోసమంటూ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హడ్కో) నుంచి ప్రభుత్వం రూ.5,000 కోట్ల అప్పు తీసుకుంటోంది. ఇందుకో­సం రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ సీఎస్‌ సోమ­వారం ఉత్తర్వు­లిచ్చారు.

హడ్కో విజయవాడ ప్రాంతీయ కార్యాలయం నుంచి రూ.5,000 కోట్ల ప్రత్యేక టర్మ్‌ లోన్‌ తీసుకునేందుకు అనుమతి, రాష్ట్ర ప్రభు­త్వ గ్యారెంటీ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంతకుముందు ఏపీపీఎఫ్‌సీఎల్‌ తీసుకున్న రూ.­710 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చింది. దీంతో ఏపీపీఎఫ్‌సీఎల్‌ మొత్తం అప్పు రూ.5,710 కోట్లకు చేరింది. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ కార్పొరేషన్ల పేరు­తో ప్ర­భుత్వ గ్యారెంటీతో బడ్జెట్‌ బయటచేసిన అ­ప్పు­లు రూ.55,383 కోట్లకు చేరాయి. గతంలో వైఎస్సా­ర్‌­సీ­పీ ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, ఎల్లో మీడియా నానా యాగీ చేసి.. దు్రష్పచారం చేశాయి. ఇప్పుడు ఏడాదిన్నరలోనే బడ్జెట్‌ బయట ప్ర­భుత్వ గ్యారెంటీతో భారీగా అప్పులు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement