TDP Dhulipalla Narendra Face Bitter Experience at Pedakakani - Sakshi
Sakshi News home page

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చేదు అనుభవం

Jun 13 2022 1:37 PM | Updated on Jun 13 2022 2:43 PM

TDP Dhulipalla Narendra Face Bitter Experience at Pedakakani - Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చేదు అనుభవం ఎదురైంది. అక్రమంగా మైనింగ్‌ జరుగుతుందంటూ మీడియాను తీసుకొని పెదకాకాని మండలం అనుమర్లపూడికి వెళ్లిన దూళిపాళ్లను అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు. అనుమతితో మట్టి తవ్వుతుంటే అక్రమ క్వారీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గొడవ పెట్టేందుకే ఇక్కడకు వచ్చారా అంటూ దూళిపాళ్లను నిలదీశారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో అంతులేని అక్రమాలు చేశారని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడకు వచ్చారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం​ చేశారు. 

చదవండి: (సత్యసాయి: టీడీపీ నేత పరిటాల సునీత దురుసు ప్రవర్తన) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement