గౌతమ్‌ రెడ్డికి ఊరట.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు | Supreme Court Given Notice To AP govt Over Gautam Reddy Case | Sakshi
Sakshi News home page

గౌతమ్‌ రెడ్డికి ఊరట.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Jan 2 2025 12:31 PM | Updated on Jan 2 2025 12:52 PM

Supreme Court Given Notice To AP govt Over Gautam Reddy Case

సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ నేత గౌతమ్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. అరెస్ట్‌ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

వైఎస్సార్‌సీపీ నేత గౌతమ్‌ రెడ్డి పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో గౌతమ్‌ రెడ్డికి ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణ జరిగే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వం.. కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది.

ఇక, సుప్రీంకోర్టులో గౌతమ్‌ రెడ్డి తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. గౌతమ్ రెడ్డిపై టీడీపీ ప్రభుత్వం అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయించిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, ఈ కేసులో ఏపీ ప్రభుత్వం కేవియట్ ఎలా దాఖలు చేస్తుందని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ కేసులో  ఫిర్యాదుదారుడు కాకుండా, ప్రభుత్వమే ఎందుకు యాక్టివ్‌గా ఉందని కోర్టు ప్రశ్నించింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement