AP Staff Nurse Recruitment 2022: వైద్యారోగ్యశాఖలో నోటిఫికేషన్‌ రిలీజ్‌.. పూర్తి వివరాలు ఇవే..

Staff Nurse Notification Released In AP Health Department - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ పోస్టుల నియమాకానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాగా, 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్‌ పద్దతిన శుక్రవారం నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యింది. పోస్టులకు డిసెంబర్‌ 2వ తేదీ నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు అప్లికేషన్స్‌ను స్వీకరించనున్నారు. పూర్తి చేసిన అప్లికేషన్లను డిసెంబర్ 9లోగా ఆయా రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాలి. 

ఇక, మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనుంది. వచ్చిన దరఖాస్తుల్లో ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ను 19వ తేదీన తీస్తారు. అనంతరం, 20వ తేదీన సెలక్షన్‌ లిస్ట్‌ను తీసి.. డిసెంబర్‌ 21, 22వ తేదీల్లో కౌన్సిలింగ్‌, అపాంట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇవ్వనున్నారు. అయితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. 

రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల చిరునామాలు ఇవే..

విశాఖపట్నం ఆర్డీ కార్యాలయం: రీజనల్ డైరెక్టర్, బుల్లయ్య కాలేజీ ఎదురుగా, రేసపువానిపాలెం

రాజమండ్రి ఆర్డీ కార్యాలయం: జిల్లా ఆసుపత్రి ప్రాంగణం , రాజమండ్రి

గుంటూరు ఆర్డీ కార్యాలయం: పాత ఇటుకులబట్టి రోడ్ , అశ్విని ఆసుపత్రి వెనుక, గుంటూరు

వైఎస్సార్ కడప ఆర్డీ కార్యాలయం: పాత రిమ్స్ ప్రాంగణం, కడప

- జోన్ల వారీగా ఖాళీల వివరాల కోసం https://cfw.ap.nic.in/ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top