‘అమ్మ ఆవేదన’కు కదిలిన హృదయాలు | Srikakulam: Donors Responds Amma Avedhana Article In Sakshi | Sakshi
Sakshi News home page

‘అమ్మ ఆవేదన’కు కదిలిన హృదయాలు

Sep 1 2021 3:24 PM | Updated on Sep 1 2021 8:14 PM

Srikakulam: Donors Responds Amma Avedhana Article In Sakshi

శ్రీకాకుళం: టెక్కలి ఎన్‌టీఆర్‌ కాలనీకు చెందిన బూసి అఖిల్‌ అనే కిడ్నీ బాధిత యువకునికి సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. కుమారుడి రెండు కిడ్నీలు పాడై, మెరుగైన వైద్యం కోసం తల్లి లోకేశ్వరి డబ్బులు కోసం పడుతున్న వేదనపై ‘సాక్షి’ లో ‘అమ్మ ఆవేదన’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి దాతలు స్పందిస్తున్నారు. టెక్కలికి చెందిన అభయం యువజన సేవా సంఘం సభ్యులు తమ వంతు సాయంగా రూ.15 వేలను బాధితుడి తల్లి లోకేశ్వరికి అందజేశారు.

ఇందులో సేవా సంఘం నుంచి రూ.10 వేలు, ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఆర్థోపెడిక్‌ వైద్యుడు శంభాన శ్రీనివాసరావు తన వంతు సాయంగా రూ.5 వేలు అందించారు. అలాగే పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్‌ బెహరా కృష్ణవేణి కాళీ తన వంతు సాయంగా రూ.5 వేలను బాధితుడి తల్లికి అందజేశారు.

చదవండి: ట్విట్టర్‌ను వదిలేస్తున్నారు,'కూ' కు క్యూ కట్టేస్తున్నారు

 

Advertisement
 
Advertisement
Advertisement