Srikakulam: సిక్కోలు నగరానికి న్యూలుక్‌

Srikakulam: Bridges, Flyovers, Walls Beautified With Theme Based Paintings - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా విశిష్టతలు చిత్తరువుల రూపంలో కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయి. గోడలపై గీసిన చిత్రాలు ప్రతి ఒక్కరినీ రంజింప చేస్తున్నాయి. అందమైన కుడ్య చిత్రాలు నగరానికి కొత్తశోభను తీసుకొస్తున్నాయి. పరిసరాలు అందంగా ఉంటే ఆ అనుభూతే వేరు. సిక్కోలు నగరంలో ఇప్పుడదే కనబడుతోంది. 


రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని పలు కూడళ్లు, ఫ్లైవోవర్లు, వంతెనలు, ప్రభుత్వ ప్రాంగణాల గోడలపై రంగులతో అద్దుతున్న చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా కనబడుతున్నాయి. 


నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో భాగంగా శ్రీకాకుళంలో కుడ్య చిత్రాలను వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంస్కృతి ప్రతిబింబించేలా రంగులతో వేస్తున్న ఈ చిత్రాలు చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల జోరుగా పనులు జరుగుతున్నాయి. 


జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై వోవర్లు, వంతెనలు, సెంట్రల్‌ డివైడర్లు, పార్కులు, పాఠశాలు/కళాశాలల ప్రహరీలు, ప్రభుత్వభవనాల కాంపౌడ్స్‌కు జిల్లా, నగర చరిత్రను తెలియ జేసే కుడ్యచిత్రాలను ప్రత్యేక రంగులతో వేస్తున్నారు. నగరంలో 23 ప్రదేశాల్లో ఈ రకంగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అరసవల్లి, వంశధార, నాగావళి, మన జాతీయతను తెలియజేసే పెయింటింగ్స్‌ వేస్తున్నారు. 


రూ.1.43 కోట్లతో ఈ పనుల్ని చేపడుతున్నారు. శరవేగంగా పనులు జరిగేలా కమిషనర్‌ ఓబులేసు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా రాజీ పడకుండా, దగ్గరుండి పెయింటింగ్స్‌ వేయించే పనిలో నిమగ్నమయ్యారు. (క్లిక్‌: డిలీట్‌.. డిలీట్‌.. డిలీట్‌... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top