మామిడి మార్కెట్లలో తనిఖీలు

Special teams Checks at mango markets - Sakshi

ఫుడ్‌సేఫ్టీ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్‌శాఖలతో ప్రత్యేక బృందాలు

కృష్ణా జిల్లాలో 9 కేసులు నమోదు

నిషేధిత ఎథెఫాన్‌తో మామిడి,ఇతర పండ్లను మాగపెట్టే 

వ్యాపారులపై ఉక్కుపాదం

సాక్షి, అమరావతి: ‘మధురఫలం.. చైనా హాలాహలం’ శీర్షిక న మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం కలిగిం చింది. సీజనల్‌ ఫ్రూట్స్‌ను 24 గంటల్లో మగ్గపెట్టి సొమ్ము చేసుకునే లక్ష్యంతో కొంతమంది వ్యాపారులు నిషేధిత ఎథెఫాన్‌ పౌడర్‌ను మోతాదు కు మించి వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. పురుగుమందుల మాటున చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎథెఫాన్‌ పౌడర్‌ను ఇష్టానుసారం వినియోగిస్తున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపింది. ఆహార భద్రతా విభాగం, ఉద్యానశాఖ కమిషనర్లు కాటమనేని భాస్కర్, డాక్టర్‌ ఎస్‌. ఎస్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు ఉద్యాన, రెవెన్యూ, పోలీస్‌శాఖలతో కలిసి ఆహార భద్రతా విభాగం అధికారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్లలో తనిఖీలకు శ్రీకారం చుట్టారు.

కృష్ణాజిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఆదేశాలతో జోనల్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఎన్‌.పూర్ణచంద్రరావు నేతృత్వంలో ఉద్యానశాఖ ఏడీ దయాకరబాబు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు శేఖరరెడ్డి, గోపాలకృష్ణ, శ్రీకాంత్‌  జిల్లా వ్యాప్తంగా ఉన్న మ్యాంగో మార్కెట్లను విస్తృతంగా తనిఖీ చేశా రు. రాష్ట్రంలోని ప్రధాన మ్యాంగో మార్కెట్లలో ఒకటైన నున్న మ్యాంగో మార్కెట్‌తో పాటు జిల్లాలోని ఇతర మార్కెట్‌లలో దాడులు నిర్వహించారు. దాదాపు అన్ని మార్కెట్లలోను ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనలకు విరుద్ధంగా ఎథెఫాన్‌ను విచ్చలవిడిగా విని యోగిస్తున్నట్టు గుర్తించారు. ఆ మార్కెట్లలో శాంపి ల్స్‌ సేకరించి  కేసులు పెట్టారు. ఈదరలోని కేజీఎన్‌ మ్యాంగో కంపెనీ, చీమలపాడులోని రసాలు మ్యాంగో కంపెనీ, చీమలగూడెంలో శ్రీరామాంజనేయ ఫ్రూట్‌ మార్కెట్, ఎ.కొండూరులో కృష్ణ ఆగ్రోస్‌ (మ్యాంగో యార్డు), నున్న మార్కెట్‌లోని యశస్వినీప్రసన్నలక్ష్మి ఫ్రూట్‌ కంపెనీ, కోటేశ్వరరావు ఎస్‌బీఎఫ్‌ కంపెనీలపై 9 కేసులు నమోదు చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా దాడులు 
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఈ దాడులు కొనసాగుతాయి. ఈరోజు కృష్ణాజిల్లాలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఈ తనిఖీలు మ్యాంగో సీజన్‌కు పరిమితం కాదు. బొప్పాయి, బత్తాయి, జామ, అరటి తదితర పండ్లను మాగబెట్టే విషయంలో ఎథెఫాన్‌ వంటి విషపూరిత రసాయనాలు వినియోగిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం.
– స్వరూప్, జాయింట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top