ఏపీ పర్యాటకానికి ప్రత్యేక యాప్‌: మంత్రి అవంతి

Special App Launching To AP Tourism Says Minister Avanthi Srinivas - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తితో పర్యాటక శాఖకు నష్టం వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలో 13 చోట్ల 5 స్టార్ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని చెప్పారు. ప్రసాదం పథకం కింద శ్రీశైలంలో అభివృద్ధి చేశాం.. సింహాచలంలో ఆ పథకం కింద రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామని వివరించారు.

పర్యాటన ప్రాంతాల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతామని పేర్కొన్నారు. స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్యాకేజిలు రూపొందిస్తామని వెల్లడించారు. సీ ప్లేన్స్ కూడా తీసుకొచ్చి విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నట్లు గుర్తుచేశారు. 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. పర్యాటక ప్రాంతాల్లో మద్యం ప్రోత్సహించాలన్నది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కరోనాతో చనిపోయిన ఇద్దరు పర్యాటక కాంటాక్ట్  ఉద్యోగుల కుటుంబంలో వారికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీస్కున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ తెలిపారు. 36 పర్యాటక హోటళ్లలో నిర్వహణ పర్యాటకులకు ఇబ్బంది  లేకుండా  చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అందమైన  సముద్రం... అడవులు ఉన్నాయని, ఎకో టూరిజం అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో ఒక  యాప్  తీసుకురాబోతున్నామని.. దసరాకు టూరిజం యాప్ సిద్ధమవుతుందని మంత్రి తెలిపారు. లోకల్ టూరిస్ట్‌లకు నాలుగు జోన్లుగా  చేస్తున్నామని, జోన్‌కొక మేనేజర్ ఉంటాడని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top