ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎస్పీ చరణ్‌ హర్షం

SP Charan Thanks CM YS Jagan Nellore Music Dance School Renamed SPB - Sakshi

సాక్షి, అమరావతి: నెల్లూరులోని మ్యూజిక్‌, డ్యాన్స్‌ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్‌ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టడం పట్ల ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రికి దక్కిన గొప్ప గౌరవమని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వానికి ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును చేరుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేశారు.

మైసూరు వర్సిటీలో ఎస్పీ బాలు అధ్యయన పీఠం
మైసూరు: ఎస్పీ బాలు సుబ్రహ్మణ్యం పేరుతో మైసూరు విశ్వ విద్యాలయంలో అధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేయనున్నారు. గురువారం వర‍్సిటీలో వీసీ హేమంత్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన సిండికేట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ బాలు జీవిత సాధనలను, పాటలను భవిష్యత్‌ తరాలవారికి అందించేలా ఈ పీఠం నెలకొల్పుతున్నామని వీసీ తెలిపారు. ఇందుకోసం రూ.5 లక్షలను కేటాయిస్తామన్నారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top