Social Media Memes On Chandrababu Naidu BIPC In Engineering Comments - Sakshi
Sakshi News home page

బైపీసీతో ఇంజినీరింగ్‌.. బాబుపై పేలుతున్న మీమ్స్‌

Aug 17 2023 11:47 AM | Updated on Aug 17 2023 3:33 PM

Social Media Memes On Chandrababu Bipc In Engineering Comments - Sakshi

ఇంజినీరింగ్‌ చేయాలంటే ఇంటర్‌లో బైపీసీ చేయాలంటూ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పేలుతున్నాయి.  40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు మరోసారి తన అజ్జానాన్ని ప్రదర్శించి పరువును దిగజార్చుకోవడంతో ఇదెక్కడి విజనరీ బాబు అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇదేనా మీ విజనరీ పాఠాలు అంటూ  ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు.

అప్పుడెప్పుడో టీడీపీ నేత జలీల్ ఖాన్.. బీకామ్ లో ఫిజిక్స్ అంటూ బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు.. ఇంటర్లో ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ కోసం బైపీసీ అంటూ హైలెట్ అయ్యారు. ప్రసంగాల్లో నేతలు తడబడటం సహజమే కానీ, మరీ ఇలా విజన్ -2047 అంటూ దేశానికే దిశా నిర్దేశం చేసేలా ప్రసంగం మొదలు పెట్టిన చంద్రబాబు ఇంటర్లో ఇంజినీరింగ్ అంటూ బుక్కయిపోవడం మాత్రం విశేషం. కాగా ఆగస్టు 15 సందర్భంగా విశాఖపట్నంలో "ఇండియా విజన్ 2047" డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తన విజన్‌ గురించి వివరించే సమయంలో.. ఇంటర్మీడియట్ ఎక్కడ చేయాలి.. ఇంజినీరింగ్‌ చేయాలంటే ఇంటర్మీయట్‌లో బైపీసీ చేయాలి.. అని వివరిస్తూ పప్పులో కాలేశారు.  
చదవండి: Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్

సోషల్‌ మీడియాలో చంద్రబాబుపై పేలుతున్న మీమ్స్‌ ఇవే... ⬇️

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement