స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు: భాస్కర్‌ వ్యవహారంలో హైకోర్టుకు సీఐడీ, పిటిషన్‌ విచారణకు కోర్టు అనుమతి

Skill Development case: AP High Court Allows CID Petition - Sakshi

సాక్షి, కృష్ణా: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీవీఎస్‌ భాస్కర్‌ వ్యవహారంలో విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలను.. సవాల్‌ చేస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది సీఐడీ. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు అనుమతించింది. 

ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవతవకలు జరిగాయని కేసు నమోదు చేసిన సీఐడీ.. భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే.. ఈ కేసులో భాస్కర్‌ రిమాండ్‌ను విజయవాడ సీఐడీ కోర్టు తిరస్కరించింది. భాస్కర్‌ను సీఐడీ అధికారులు విచారించాలని అనుకుంటే 41-ఏ సీఆర్పీసీ ప్రకారం చేయవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించింది సీఐడీ.

మరోవైపు ఈ కుంభకోణంలో.. గతంలో కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన ఆర్జా శ్రీకాంత్‌ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. గురువారం దాదాపు 11 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు.. ఇవాళ సైతం ప్రశ్నిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top