మరో మదనపల్లె..! రాత్రంతా పిచ్చిపట్టినట్టుగా

Similar To Madanapalle Incident Family Strange Actions Make Shocking - Sakshi

విశాఖపట్నం: రాష్ష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె ఘటన తరహాలోనే విశాఖలోనూ ఓ కుటుంబం చేసిన వింత చేష్టలతో స్థానికులు హడలెత్తిపోయారు. వివరాల ప్రకారం.. విశాఖ అజిమాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంటి లోపల గడియపెట్టుకొని రాత్రంతా పిచ్చిపిచ్చి కేకలు, శబ్దాలు చేశారు. ఎంత పిలిచినా బయటకు రాపోవడంతో మదనపల్లి తరహా ఘటన జరిగిందేమోనని స్ధానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. (మైనర్‌ బాలికపై లైంగిక దాడి..కామాంధుడు అరెస్ట్‌ )

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు తీసే ప్రయత్నం చేసినా అటునుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు పగలకొట్టి  నలుగురు కుటుంబసభ్యులను బయటకు తీసుకువచ్చారు. వారి మాటలను గమనించిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ మళ్ళేశ్వరరావు మానసికంగా ఒత్తిడికి గురవున్నట్టు తెలిపారు. భర్త అబ్దల్  మజీద్ , భార్య మేహరో,కొడుకు నూరుద్దీన్ ,కూతురు నూర్ గత కొన్నాళ్లుగా మానసిక రుగ్మతకు గుర్తె పిచ్చి కేకలు వేస్తున్నట్టు స్ధానికులు చెప్పినట్లు పేర్కొన్నారు. నలుగురుని వ్తెధ్యం కోసం నగరంలోని మానసిక వ్తెద్యశాలకు తరలించినట్లు సిఐ తెలిపారు. (చేతబడి చేసిందని కక్ష పెంచుకుని హత్య)

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top