త్వరలో టికెట్‌ రేట్ల హేతుబద్ధీకరణ

Rationalization of Cinema ticket rates soon in Andhra Pradesh - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది

మా అభిప్రాయాలను కమిటీ సానుకూలంగా స్వీకరించింది

అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుంది

ఏపీ ఫిల్మ్‌ చాంబర్‌ ఉపాధ్యక్షుడు ముత్యాల రాందాస్‌ వెల్లడి

సచివాలయంలో సినిమా టికెట్‌ రేట్లపై ప్రభుత్వ కమిటీ భేటీ

సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్రంలో సినిమా టికెట్‌ రేట్ల హేతుబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని ఏపీ ఫిల్మ్‌ చాంబర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ముత్యాల రాందాస్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తోందన్నారు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ బుధవారం సచివాలయంలో సమావేశ మైంది. ఇందులో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ గోయర్స్, థియేటర్లు, ఫిల్మ్‌ చాంబర్‌ అసోసియేషన్‌ సభ్యుల నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలను స్వీకరించారు.

మున్సిపాలిటీలు, నగర, గ్రామ పంచాయతీల్లో రేట్లు తక్కువగా ఉండటంతో వాటిని పెంచాలని పలువురు సభ్యులు కమిటీకి విజ్ఞప్తి చేశారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన చర్చలో టికెట్‌ రేట్లను ప్రాంతాల వారీగా నిర్ణయిం చాలా?, థియేటర్లను బట్టి ఉండాలా? అనే అంశా లపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా సచివాలయంలో రాందాస్‌ మీడియాతో మాట్లాడు తూ.. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నా రు. తదుపరి సమావేశంలో అన్ని అంశాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయన్నారు. పలు సిని మాలు విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రక్రి యను వేగంగా పూర్తిచేయాలని కోరామన్నారు.

మల్టిప్లెక్స్‌లో కూడా సామాన్యులకు వినోదం దొరికేలా ఉండాలన్నారు. ఎగ్జిబిటర్‌ వేమూరి బాలరత్నం మాట్లాడుతూ.. అన్ని తరగతుల టికెట్‌ రేట్లను పెంచాలని కమిటీకి నివేదించామన్నారు. కొత్తగా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు.. కమిటీ సభ్యులు సూచించిన రేట్లు చాలావరకు దగ్గరగానే ఉన్నట్లు చెప్పారు. అలాగే, సెన్సార్‌ బోర్డు సభ్యుడు, సినీ విమర్శకుడు ఓంప్రకాశ్‌ మాట్లాడుతూ.. కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం కూడా అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా టికెట్‌ రేట్లు నిర్ణయిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ చాంబర్‌ ఉపాధ్యక్షుడు సీతారాం ప్రసాద్‌ మాట్లాడుతూ.. పంచాయతీలు, నగర పంచాయతీల్లో టికెట్‌ రేట్లు పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రాంతాలను బట్టి కాకుండా ఏసీ, నాన్‌ ఏసీ థియేటర్ల  వారీగా రేట్లు నిర్ణయించాలన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top