తిరుమలలో నేడు రామాయణ పారాయణం | ramayana recitation today in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో నేడు రామాయణ పారాయణం

Jan 22 2024 8:26 AM | Updated on Jan 22 2024 3:43 PM

ramayana recitation today in tirumala - Sakshi

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్‌మెంట్లు నిండాయి. నిన్న ఆదివారం 77,334 మంది స్వామివారిని దర్శించుకోగా 23,694 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.04 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

తిరుమలలో నేడు రామాయణ పారాయణం 
తిరుమలలోని ధర్మగిరి వేదపాఠశాలలో సోమవారం సంపూర్ణ రామాయణ పారాయణం కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనుంది. అయోధ్యలో సోమవారం రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు రామాయణ పారాయణం నిర్వహించనున్నారు.

అయోధ్యలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఎస్వీబీసీ తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లతో పాటు యూట్యూబ్‌ తెలుగు ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఎస్వీబీసీ తెలుగు ఛానల్‌లో తిరుమలలోని కళ్యాణోత్సవం అనంతరం 12 గంటల నుంచి అయోధ్య కార్యక్రమాలు ప్రత్యక్షప్రసారం కానున్నాయి.

భక్తులు ఈ విషయాలను గమనించి ఎంతో వైభవంగా, ఆగమోక్తంగా జరిగే అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛాన‌ళ్లలో వీక్షించి తరించాలని భక్తలోకానికి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement